ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న ఐదు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈరోజు(సోమవారం) విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నేడు ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉన్నాయని పేర్కొంది హైదరాబాద్ వాతావరణ శాఖ. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 24 వరకు వర్ష సూచన ఉందని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.