తిరుమల వెళ్లే ఎన్నారై భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది టిటిడి పాలక మండలి. ఇక పైన ఎన్నారై భక్తులకు ప్రతిరోజు 100 విఐపి బ్రేక్ దర్శన టికెట్లు అందించేందుకు సిద్ధమైంది. చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో తిరుమలలో ఎన్ఆర్ఐ భక్తులకు అందించే విఐపి బ్రేక్ దర్శన కోట 50 నుంచి పదికి తగ్గించారు.

అయితే ఈ విషయాన్ని ఎన్నారై అసోసియేషన్ అధ్యక్షుడు రవి వేమూరి… చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్ఆర్ఐ కోటాను 10 నుంచి 100 టికెట్లకు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఆర్ఐ టికెట్ల కోసం ఈ https://apnrts.ap.gov.in/ వెబ్సైట్ సంప్రదించాలి