విమాన ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఒక ఘటన జరిగి దానిని మర్చిపోకముందే మరో ప్రమాద ఘటన జరుగుతూనే ఉంది. తాజాగా బంగ్లాదేశ్ లో విమాన ప్రమాదం జరిగింది. రాజధాని డాకాలో కాలేజీ ప్రాంగణంలో F-7 జెట్ కుప్ప కూలింది. దీంతో ఒక్కసారిగా ఫైటర్ జెట్ లో మంటలు చెలరేగాయి.

దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన కాలేజీ ప్రాంగణంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా…. 100 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.