సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి – హైదరాబాద్ పోలీసులు

-

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని హైదరాబాద్ పోలీసులు సూచనలు చేశారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉంది. ఇవాళ కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తరుణంలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ముందస్తు సూచనలు చేశారు సైబరాబాద్ పోలీసులు.

Software employees advised to work from home if possible
Software employees advised to work from home if possible

అవసరమైతే ఎవరూ బయటికి రావొద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అలర్ట్ జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు.  తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉండబోత వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

 

Image

Read more RELATED
Recommended to you

Latest news