హైదరాబాద్ ఆరాంఘర్ లో అధునాతన సౌకర్యాలతో కొత్త బస్టాండ్ నిర్మించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. 10 ఎకరాల భూమిని తమకు కేటాయించాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఎవరితోంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లా ప్రజలు JBS… విజయవాడ, ఖమ్మం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఎంజీబీఎస్ అందుబాటులో ఉంది.

దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల వారి సౌకర్యం కోసం రూ. 100 కోట్లతో ఈ కొత్త బస్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా…. జేబీఎస్ బస్టాండ్ లో కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, గోదావరిఖని, ఖమ్మం లాంటి బస్సులు మాత్రమే వస్తాయి. ఏపీకి వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ కి వస్తాయి.