టిమ్ డేవిడ్ విధ్వంసం.. మూడు ఓవర్లలో 71 రన్స్

-

సాధారణంగా క్రికెట్ ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం కష్టం అనే చెప్పాలి. ఎప్పుడూ ఏ ఆటగాడు అద్భుతంగా ఆడుతాడో.. ఎప్పుడూ తన ఫామ్ ని కోల్పోతాడే తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా వెస్టిండిస్ మధ్య టీ-20 సిరీస్ జరుగుతోంది. ఇవాళ వెస్టిండీస్ తో జరిగిన 3వ టీ-20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ విధ్వంసం సృష్టించారు. వెస్టిండీస్ బౌలర్ మోతీ వేసిన 10వ ఓవర్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

Tim David

తొలి బంతికే ఫోర్ కొట్టగా.. తరువాత బాల్ డాట్ అయింది. అనంతరం 4 బంతులను అతడు సిక్స్ లుగా మలిచాడు. దీంతో ఆ ఓవర్ లో 28 రన్స్ వచ్చాయి. ఆ తరువాత 2 ఓవర్లలో వరుసగా 20, 23 రన్స్ వచ్చాయి. దీంతో కేవలం 18 బంతుల్లోనే ఆస్ట్రేలియా 71 రన్స్ రాబట్టింది. ఆస్ట్రేలియా బ్యాటర్ టిమ్ డేవిడ్ విరవీహారం చేశారు. 11 సిక్సర్లు, 6 ఫోర్లతో రెచ్చిపోయాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాదారు. ఆస్ట్రేలియా తరుపున ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ 50 చేశాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ లో గెలుపుతో ఆస్ట్రేలియా జట్టు 3-0తో సిరీస్ ను దక్కించుకుంది. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news