Mithun Reddy: మిథున్ రెడ్డితో తల్లి, సోదరి ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డిని కలిసారు తల్లి స్వర్ణమ్మ, సోదరి. కాగా ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 10 రోజుల పాటు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు.

మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. చంద్రబాబు నాయుడును ఉంచిన జైలులోనే మిథున్ రెడ్డిని పెట్టి పగ తీర్చుకుందని టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.