భారతదేశంలో పెను విషాదం చోటుచేసుకుంది ఇండో వర్సెస్ పాకిస్తాన్ వార్ హీరో మృతి చెందారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ డీకే పరుల్కర్ ఆదివారం రోజున మరణించారని ఐఏఎఫ్ అధికారిక ప్రకటన చేసింది. వాస్తవానికి ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ డీకే… ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. 1965 సంవత్సరం ఇండో వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం లో ప్రత్యర్ధులు ఆయన విమానంపై కాల్పులు… జరిపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే విమానం వదిలేసి ప్రాణాలు కాపాడుకోమని ఉన్నతాధికారులు ఆయనకు సూచనలు చేశారు. కానీ ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రాణాల కోసం ఫ్రాకులాడలేదు. ధైర్యంగా విమానాన్ని తిరిగి బేస్ కు తీసుకువచ్చేశారు. అలాగే 1971 సంవత్సరంలో ఇండో వర్సెస్ పాకిస్తాన్ వార్ సమయంలో కూడా.. యుద్ధ ఖైదీగా ఉన్న ఆయన… అదే సమయంలో వారి.. కళ్ళు కప్పి తప్పించుకొని ఇండియాకు చేరిపోయారు. అలాంటి రియల్ హీరో ఆదివారం రోజున మరణించారు.