తెలంగాణ వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 17 వరకు అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ లోనూ ఒకట్రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట.

ఆగస్టు 15న భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది తెలంగాణ వాతావరణ శాఖ.
దింతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.