బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం నెలకొంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నేడు ఈడీ విచారణ హీరో రానా ఎదురుకోనున్నారు. నేడు విచారణకు హాజరుకావాలని రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. నిజానికి రానాను జూలై 23 న విచారణ కు రావాలని నోటీసులు ఇచ్చారు.

అప్పుడు సినిమా షూటింగ్ ఉందని, రాలేకపోతున్నాను అంటూ రానా ఈడీకి లేటర్ రాశారు.
దీంతో ఆగష్టు 11న కచ్చితంగా హాజరు కావాలని రానాకు ఈడీ మరో నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈడీ విచారణకు ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ నెల 13న హాజరుకానున్నారు మంచు లక్ష్మి. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో నేడు ఈడీ విచారణ హీరో రానా ఎదురుకోనున్నారు.