కేసి వేణుగోపాల్ కు పెను ప్రమాదం తప్పింది. కేసి వేణుగోపాల్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తప్పింది. త్రివేండ్రం నుంచి ఢిల్లీ వెళ్తూ వాతావరణం సహకరించక, టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా విమానాన్ని చెన్నైకి దారి మళ్లించింది సిబ్బంది.
దాదాపు రెండు గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టి చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.

ఇదే విమానంలో కాంగ్రెస్ పార్టీ జెనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు ప్రయాణిస్తున్నారు. దీనిపై కేసి వేణుగోపాల్ మాట్లాడారు. త్రివేండ్రం నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI 2455 ఈరోజు విషాదానికి దగ్గరగా వచ్చిందని పేర్కొన్నారు.
నేను, అనేక మంది ఎంపీలు మరియు వందలాది మంది ప్రయాణికులతో – త్రివేండ్రం నుండి ఢిల్లీకి బయలు దేరాము… ఆలస్యంగా బయలుదేరడం వంటిది భయంకరమైన ప్రయాణంగా మారిందన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, మేము అల్లకల్లోలానికి గురయ్యామని చెప్పారు. దాదాపు గంట తర్వాత, కెప్టెన్ విమాన సిగ్నల్ లోపం ఉందని ప్రకటించి విమానాన్ని చెన్నైకి మళ్లించాడని వివరించారు.