నిధి అగర్వాల్‌కు ప్రభుత్వ వాహనం.. ఎవడబ్బ సొమ్ము అంటూ ట్రోలింగ్ !

-

టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ అడ్డంగా దొరికిపోయారు నిధి అగర్వాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్… ఏపీలో తిరుగుతున్నారు. తాజాగా విజయవాడ నగరంలో షాపింగ్ మాల్ కు కూడా ఈ ప్రభుత్వ వాహనంలోనే వెళ్లడం జరిగింది.

Government vehicle , Nidhi Agarwal
Government vehicle for Nidhi Agarwal

దీంతో హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రొమాన్స్ చేసింది నిధి అగర్వాల్. ఒక సినిమా చేసినంత మాత్రాన ప్రభుత్వ వాహనం ఇస్తారా అని అటు పవన్ కళ్యాణ్ను కూడా ఆడుకుంటున్నారు జనాలు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news