ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ భారత్ బాయ్ కాట్ చేయాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన కామెంట్లు చేశారు. క్రికెట్ కన్నా దేశం కోసం సైనికులు చేసేటువంటి త్యాగం చాలా గొప్పది. ఒక్క మ్యాచ్ ఆడకపోతే పోయేదేమీ లేదని హర్భజన్ సింగ్ అన్నారు. ఇది చాలా చిన్న విషయం అన్నింటికన్నా దేశమే ముఖ్యం. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ఆడినట్లయితే అది సైనికుల త్యాగాలను ఎగతాళి చేసినట్లు అవుతుందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలను కొంతమంది వ్యతిరేకించగా మరి కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. హర్భజన్ సింగ్ చాలా కరెక్ట్ గా చెప్పారని పాకిస్తాన్ తో మ్యాచులు ఆడవద్దని నెటిజన్లు అంటున్నారు. దేశం కోసం ఎంతోమంది వారి ప్రాణాలను పణంగా పెట్టారు. అలాంటి వారి కోసం అయినా పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ఆడవద్దని చెబుతున్నారు. దేశం శ్రేయస్సు, సైనికుల ప్రాణాలు చాలా ముఖ్యమని పేర్కొంటున్నారు. కాగా, ఆసియా కప్ సెప్టెంబర్ 5న UAE వేదికగా ప్రారంభం కానుంది. ఇండియా, పాకిస్తాన్ తో సెప్టెంబర్ 14న తలపడనున్నాయి.