పాకిస్తాన్ దేశంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలలో నార్త్ పాకిస్తాన్ తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం అల్లాడిపోతోంది. గడిచిన 48 గంటల్లో 321 మంది మరణించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. కైబర్ పంక్తూక్వా ప్రావిన్స్ లోనే దాదాపు 37 మంది మృతి చెందినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. కొండ చరియలు విరిగిపడడం, ఫ్లాష్ ఫ్లడ్స్, వర్షాలకు ఇల్లు కూలడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది.

ఈరోజు కూడా పాకిస్తాన్ దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. వర్షాలు మరో రెండు రోజుల పాటు ఉన్నాయని తెలిసి పాకిస్తాన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించడంతో పాకిస్తాన్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్లోనే కాకుండా వివిధ ప్రాంతాలలో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలలో రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేస్తున్నారు.