బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సంచలన కామెంట్లు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడు అని అన్నారు. త్వరలోనే కేసీఆర్ పై పుస్తకం రాస్తానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ జీవితం ఆధారంగా మహేంద్ర తోటకూరి అనే వ్యక్తి ప్రజా యోధుడు పుస్తకాన్ని రాశారు. తాజాగా ఈ పుస్తకాన్ని తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధుసూదనాచారి మాజీ మంత్రి కేసీఆర్ చరిత్రను తరతరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలానే త్వరలోనే కేసీఆర్ పైన పుస్తకం రాస్తానని సిరికొండ మధుసూదనాచారి చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.