ఒక కుటుంబం ఆనందంగా ఉండటానికి ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధమే.ఇంటి సౌభాగ్యం, శాంతి అన్నీ భార్య సంతోషంలోనే దాగి ఉంటాయి దానిని కాపాడటం భర్త బాధ్యత. కానీ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేక, ఇంట్లోని భార్యపై కోపాన్ని చూపిస్తారు కొందరు. కోపం ఇద్దరు వ్యక్తుల మధ్య దూరాన్ని పెంచడమే కాక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. భార్యాభర్త ఇద్దరు ఒకరిపై ఒకరు కోపం తెచ్చుకోకుండా సంతోషంగా ఉంచే సీక్రెట్ టిప్స్ చూద్దాం.. ఇవి సింపుల్ గా ఫాలో అయితే మీ రిలేషన్ మరింత మధురమవుతుంది.
మాటలు శ్రద్ధగా వినండి : కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకోండి. ఫోన్ పక్కన పెట్టి కంటి చూపుతో ఆమె ఏం చెప్పాలనుకున్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఆమెకు మీరు కేర్ చేస్తున్నారని ఫీల్ అవుతుంది. చెప్పింది వినడమే 50% కోపాన్ని తగ్గిస్తుంది. అలాకాకుండా ఆమె కోపంగా ఉందని మీరు కోపంగా మాట్లాడితే గొడవ పెద్దదవుతుంది. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందుకే ఫస్ట్ అని చెప్పేది వినండి.
ఆమె ఫీలింగ్స్ గౌరవించండి: కోపంలో ఆమె చెప్పేదాన్ని అర్థం చేసుకొని, నీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయని ఆమెకు చెప్పండి ఆమె సమస్యలను మీ సమస్యలా భావించండి. నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిద్దాం, నాకు సమయం కావాలని అడగండి. ఇంటి పని, వంట పని, బయట ఆఫీస్ పని అంటూ ఆడవాళ్లు క్షణం తీరిక లేకుండా కష్టపడుతుంటారు. ఆ కష్టాన్ని మీరు గుర్తించినట్లు ఆమెకి చెప్పండి. మీ మాటలే ఆమె కోపాన్ని ప్రేమగా మారుస్తాయి, రిలేషన్ ను బలపరుస్తాయి.

సారీ చెప్పడానికి వెనకాడకండి : మీ భార్య కోపంలో ఉంది ఆమెని ఎలాగైనా కూల్ చేయాలని మీరు అనుకున్నప్పుడు తప్పు మీది కాకపోయినా సారీ చెప్పడం నేర్చుకోండి. సారీ నీకు నేను బాధ కలిగించాను ఇంకొకసారి ఇలా జరగదు అని చెప్పండి. ఇది ఆమె హార్ట్ ను మైల్డ్ చేస్తుంది. సారీ అనేది ఈగో కాదు లవ్ స్ట్రెంత్ గా భావించండి. ఒకసారి సారీ చెప్తే జరిగే నష్టమేమీ ఉండదు. ఆమెకి కోపం తగ్గాక తప్పు మీది కాకపోయినా సారీ చెప్పిన మీ ప్రేమ ఆమెకి అర్థమవుతుంది.
చిన్న సప్రైజ్ చేయండి : కుటుంబంలో చిన్న చిన్న సర్ప్రైజ్ లు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. అందులోనూ భార్య కోపంగా ఉంటే, మీరిచ్చే సర్ప్రైజ్ ఆమె కోపాన్ని తగ్గించవచ్చు లేదా కోపం తగ్గిన తర్వాత సప్రైజ్ ఇవ్వచ్చు. ఆమెకి ఇష్టమైన ఫ్లవర్స్ ఇవ్వండి లేదా ఆమె ఫేవరెట్ ఫుడ్ తయారు చేయండి. అది కాదంటే ఆమె వండిన దానికి కాంప్లిమెంట్ ఇవ్వండి. చిన్న సర్ప్రైజ్ లు పెద్ద కోపం ను మాయం చేస్తాయి హ్యాపీనెస్ ని పెంచుతాయి.
అంతేకాక ప్రాబ్లంను డిస్కస్ చేయండి. ఆమె ఐడియాలనుకు వాల్యూ ఇవ్వండి ఫ్యూచర్ ప్లాన్స్ ను షేర్ చేసుకోండి. ఓపెన్ గా ఒకరినొకరు మాట్లాడుకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. ఈ టిప్స్ పాటిస్తే మీ భార్య కోపం కూడ హ్యాపీగా మారుతుంది. రిలేషన్షిప్ అంటే ప్రేమతో పాటు కొంత ఎఫెక్ట్ పెట్టాలి ప్రయత్నించండి.