టీమిడియా స్టార్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతూ… అందరికీ షాక్ ఇచ్చాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ కీలక ప్రకటన చేశాడు పుజారా.

భారత జెర్సీ ధరించడం అలాగే… జాతీయగీతం పాడడం.. గ్రౌండ్ లో అడుగుపెట్టిన ప్రతిసారి నా ఛాయ శక్తుల ఆడెందుకు ప్రయత్నించా అంటూ.. రిటైర్మెంట్ సందర్భంగా పేర్కొన్నారు పూజార. తనకు ఈ అవకాశం ఇచ్చిన సౌరాస్త్ర క్రికెట్ అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి, తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పుజారా 103 టెస్టులు ఆడి 7,195 పరుగులు చేశాడు, అందులో 206 నాటౌట్ అతని అత్యధిక స్కోరు. అతను 19 సెంచరీలు చేశాడు, వాటిలో 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, అతను 278 మ్యాచ్‌లు ఆడి 21,301 పరుగులు చేశాడు, అందులో 352 అతని అత్యధికం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని సగటు 51.82. అతను 66 సెంచరీలు మరియు 81 హాఫ్ సెంచరీలు చేశాడు.