హైదరాబాద్ లో మరో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. మేడిపల్లి బాలాజీహిల్స్ లో మహేందర్ రెడ్డి తన భార్య స్వాతి 5 నెలల గర్భవతిని చంపి ముక్కలుగా నరికి చంపాడు. భార్య శరీర భాగాలను బయట పడేసేందుకు ప్యాకింగ్ చేస్తుండగా శబ్దాలు విని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు… వీరిద్దరిది లవ్ మ్యారేజ్ అని పోలీసులు తేల్చారు.

అయితే ఈ కేసులో ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి శరీర భాగాలను బ్యాగ్, కవర్లో పట్టుకొని మహేందర్ రెడ్డి వెళ్ళిన దృశ్యాలు బయటకు వచ్చాయి. మేడిపల్లిలో గర్భిణీ భార్యను హత్య చేసిన అనంతరం ఆమె తల, చేతులు, కాళ్లను తీసుకెళ్లి ముసీలో పడేసాడు మహేందర్ రెడ్డి. కవర్లో చుట్టి ప్రతాప సింగారం వద్ద మూసీ నదిలో పడేసాడు. మూసీలో శరీర భాగాలు పడేసిన విషయం తెలుసుకొని, గాలింపు చర్యలు చేపడుతోంది డీఆర్ఎఫ్, క్లూస్ టీమ్ సిబ్బంది.
https://twitter.com/TeluguScribe/status/1959513523244933131