నరసింహం నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం వరించింది. సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలుగా అభిమానులను అలరించడం 15 సంవత్సరాలుగా బసవతారకం ఆసుపత్రి ద్వారా అతడు చేస్తున్న సేవలను గుర్తిస్తూ యూకే లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ నరసింహ నందమూరి బాలకృష్ణకు గుర్తింపు ఇచ్చింది. దేశ సినీ చరిత్రలో ఈ గుర్తింపు దక్కించుకున్న ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ కావడం ప్రత్యేక విశేషం.

ఈ గుర్తింపు సొంతం చేసుకున్న బాలయ్యను ఆగస్టు 30న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంలో సత్కరించనున్నారు. ఇదిలా ఉండగా…. నందమూరి బాలకృష్ణ వయసు మీద పడినప్పటికి సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తన అభిమానులను అలరించేందుకు ఎంతో కష్టపడుతున్న బాలకృష్ణకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ హీరో వరుస సినిమా షూటింగ్లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాలలోను బాలకృష్ణ చురుగ్గా పాల్గొంటారు.