గులాబీ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే పరిస్థితి నెలకొంది. అనర్హత వేటుకు ముందే రాజీనామా చేసేందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారట.

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ నలుగురు ఎమ్మెల్యేలపై… స్పీకర్ వేటు వేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే స్పీకర్ వేటు వేయకంటే ముందే తామే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ వీళ్ళు రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తో పాటు ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాజీనామా చేసే ఛాన్స్ ఉందట.