తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ప్రస్తుతం తిరుమలలో దర్శనాలకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం మాత్రమే పడుతుంది. నిన్నటి వరకు సెలవులు పూర్తయ్యాయి. మొన్నటి వరకు విపరీతంగా విద్యాసంస్థలకు హాలిడేస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు చాలా వేలాది సంఖ్యలో వచ్చారు.

ఇప్పుడు సెలవులు ముగియడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని టిటిడి స్పష్టం చేసింది. నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉంటున్నారు. కాకా నిన్న ఒక్కరోజే 72, 119 మంది తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 4.2 కోట్ల శ్రీవారి హుండీ ఆదాయం వచ్చింది.