కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు తిండి పెట్టకుండా.. విగతజీవిలా మార్చి హతమార్చింది భర్త. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న(33) అనే మహిళకు, ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరగగా, మూడేళ్ల నుండి అశ్వారావుపేటలో నివాసం ఉంటున్నారు దంపతులు.

శనివారం లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుండి కిందపడిపోయిందని, ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పారు నరేష్ బాబు. ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి, దీనస్థితిలో ఉన్న లక్ష్మీప్రసన్న మృతదేహాన్ని చూసి షాకయ్యారు తల్లిదండ్రులు. శరీరమంతా కొత్త గాయాలు, పాత గాయాల ఆనవాళ్లు చూసి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసారు లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు. రెండేళ్లుగా తమ కూతురిని గదిలో నిర్బంధించి కనీసం తమను చూడనివ్వలేదని, అదనపు కట్నం కోసమే నరేష్ బాబు కుటుంబం లక్ష్మీప్రసన్నను హతమార్చారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు.