ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. 8 మంది మృతి చెందిన సంఘటన తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బులంద్‌షహర్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భక్తులతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది కంటైనర్. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 43 మందికి గాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వాళ్లందరికీ చికిత్స కొనసాగుతున్నారు. కాస్గంజ్ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.