రేవంత్ రెడ్డి పర్యటన.. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కంచెలే !

-

 

రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టల్ ప్రారంభోత్సవంతో పాటు భవనాల నిర్మాణాలకు సంబంధించి భూమి పూజలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి… ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లడం ఇదే తొలిసారి.

OU
Revanth Reddy’s visit Fences around Osmania University

సీఎం స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు కూడా అడుగు పెట్టలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి నిరసన సెగ… తగలకూడదని పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. పెద్ద పెద్ద కంచెలు కూడా ఏర్పాటు చేశారు.

  • ఉస్మానియా యూనివర్సిటీలో భారీ బందోబస్తు
  • నేడు ఓయూకి సీఎం రేవంత్ రెడ్డి
  • దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా సీఎం కార్యక్రమాలు
  • రూ.80 కోట్లతో నిర్మితమైన రెండు హాస్టళ్లను ప్రారంభించనున్న సీఎం
  • విద్యారంగంలో సమూల మార్పులపై ప్రసంగించనున్న సీఎం రేవంత్ రెడ్డి

 

Read more RELATED
Recommended to you

Latest news