సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులను… కోల్పోయిన ఇండస్ట్రీ… ఇప్పుడు మరో స్టార్ నటుడిని కోల్పోయింది. కేజీఎఫ్ నటుడు మృతి చెందాడు. సూపర్ హిట్ మూవీ కేజిఎఫ్ సినిమాలో బాంబే డాన్ శెట్టి పాత్రలో నటించిన దినేష్ మంగళూరు కాసేపటి క్రితమే మృతి చెందారు.

ఈ విషయాన్ని అధికారికంగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఆయన మరణించారు. ఇక కేజీఎఫ్ నటుడు శెట్టి మృతి నేపథ్యంలో… పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా వీర మదకరి, చంద్రముఖి ప్రాణసకి, రాక్షస లాంటి సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందారు దినేష్.