మానవ మృగాలు ఫామ్‌హౌస్‌లలో ఉన్నాయి – సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనే లేవు అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి… మానవ రూపంలో ఉన్న మృగాలు ఫామ్‌హౌస్‌లలో ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. AIని ఉపయోగించి లేని ఏనుగులు, సింహాలను సృష్టించి అభివృద్ధిని అడ్డుకున్నారని గులాబీ నేతలపై పరోక్షంగా మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.

revanth reddy
revanth reddy

 

మళ్లీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని… యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి.. అంచనాలు తయారుచేసి ఇవ్వండి అని పేర్కొన్నారు. పోలీసులను ఆదేశిస్తున్నా.. ఆ ఒక్క రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దు.. నిరసన తెలిపేవారిని తెలపనివ్వండి అని వెల్లడించారు. ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేసారు రేవంత్ రెడ్డి. అద్దంకి దయాకర్‌కి 10-12 ఏళ్ళు ఎలాంటి పదవి రాకుండా కొంతమంది అడ్డు పడ్డారు.. కానీ నేడు ఎమ్మెల్సీ అయ్యాడు అని చెప్పారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news