శ్రీ చైతన్య హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఐరన్ బాక్స్ తో కాల్చి దుర్మార్గానికి పాల్పడ్డారు. కోనసీమ జిల్లా రాజమండ్రి మోరంపూడి శ్రీచైతన్య హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై సహచర విద్యార్థులు పైశాచికత్వానికి పాల్పడ్డారు.

ఐరన్ బాక్స్ తో పొట్ట భాగం, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టి… శ్రీచైతన్య హాస్టల్లో ర్యాగింగ్ చేసారు. బిడ్డను చూసేందుకు శ్రీచైతన్య స్కూల్కు తల్లి వెళ్లడంతో ఈ ఘటన బయట పడింది. కానీ ఇప్పటికి స్పందించలేదు యాజమాన్యం. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదరించిన ఘటనకు పాల్పడ్డాడు విద్యార్థులు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తల్లి లక్ష్ణ్మీకుమారి.
https://TWITTER.com/Telugufeedsite/status/1960242448346788034