బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వింతగా నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇచ్చారు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహరంపై ఆగ్రహంతో ఉన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. తనను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

ఈ విషయంపై చంద్రశేఖర్ తివారీని కలిస్తే పార్టీ అధ్యక్షుడిని కలవమంటున్నారన్న విశ్వేశ్వర్ రెడ్డి…. రాంచందర్ రావును కలిస్తే అభయ్ పాటిల్ ను కలవమంటున్నారని సీరియస్ అయ్యారు. ఆయన్ని కలిస్తే ఇంకొకరి పేరు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్రమాల సమన్వయలోపంపై బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గుస్సా అయ్యారు.