జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా 30 మంది భక్తులు మృతి చెందారు. గత కొద్ది రోజుల నుంచి జమ్మూ కాశ్మీర్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాత్రాలోని వైష్ణో దేవి యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏకంగా 30 మంది యాత్రకులు మరణించారు. మరో 23 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ప్రస్తుతం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఘటనా స్థలంలో ఆర్మీ, NDRF రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా చోట్ల బ్రిడ్జిలు, రోడ్లు, పవర్ లైన్లు, టవర్స్ ధ్వంసం అయి జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు రావి, చినాబ్, తావి, బియాస్ నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. నదులు నీటితో ఉప్పొంగిపోతున్నాయి. వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని ప్రజల సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.