చంద్రబాబు గారూ… మీ బతుకంతా మోసమేనా? అని జగన్ ఫైర్ అయ్యారు. మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉందని ఆగ్రహించారు. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. 2024, మార్చిలో ఎన్నికల నాటికి మా ప్రభుత్వం హయాంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. కాని, మీరు ఈ ఆగస్టులో ఇచ్చిన పెన్షన్లు 62,19,472.

అంటే ఏకంగా 4,14,900 పెన్షన్లను నిర్దాక్షణ్యంగా మీరు కత్తిరించడమే కాకుండా కొత్తగా ఒక్క పెన్షన్కూడా మంజూరు చేయలేదు. ఇది మోసం కాదా? దగా కాదా?అని నిలదీశారు. విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్ చేశారు. చేస్తున్నారని మండిపడ్డారు. రీ వెరిఫికేషన్ పేరిట వారికి నరకయాతన చూపిస్తున్నారు. వారిని ఇంతగా కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? మనిషి అన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? అని నిప్పులు చెరిగారు జగన్.
.@ncbn గారూ… మీ బతుకంతా మోసమేనా? మీరొక ఘరానా మోసగాడని ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ప్రతిరోజూ రుజువవుతూనే ఉంది. ప్రజలకు ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలేకాదు, అంతకుమించి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ అన్నారు, సూపర్… pic.twitter.com/VUKFqePO92
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2025