తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ కూడా అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ మరో ఐదు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేవలం ఈ ఐదు జిల్లాలకు మాత్రమే రెడ్ అలర్ట్ ఉంది. అలాగే మంచిర్యాల, అసిఫాబాద్, భువనగిరి, రాజన్న సిరిసిల్ల, అదిలాబాద్, జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే… చాలా జిల్లాలలో స్కూళ్లకు హాలిడే కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు జిల్లాల్లో సెలవు కొనసాగుతోంది.
Housing Board and GR colony in #Kamareddy town were completely submerged, people asking for help.
About 5 vehicles were washed away in the HB colony due to the flood water. The same situation prevailed in other colonies in the town.#KamareddyFloods… pic.twitter.com/9yhU3qHq4h
— Surya Reddy (@jsuryareddy) August 27, 2025