విజయవాడ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అలర్ట్.. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు రానున్నాయి. రెండు రోజుల కిందటే ఈ రూల్స్ అమలు చేస్తామని చెప్పి…. నేటి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు చేస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనంచేసుకోవాలి.

అమ్మవారి ఆలయ ఆవరణలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం ఉంటుంది. ఇలాంటి చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఆలయ సిబ్బందికి కూడా సేమ్ రూల్స్ విధింపు చేశారు ఇంద్రకీలాద్రి ఆలయ EO. ఇకపై వాకీటాకీలతోనే సిబ్బంది పర్యవేక్షణ చేయనున్నారు. ఐడి కార్డులు తప్పనిసరి చేసారు. భక్తులు అసభ్య కర దుస్తుల్లో రావడం, లోపల వీడి యోలు తీసి నెట్టింట్లో వైరల్ చేస్తుండటం వల్లే.. ఈ కొత్త రూల్స్ అమ ల్లోకి రానున్నాయి.