పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి ఒక్కో కథలోను ఎన్నో నీతి పాఠాలు ఉన్నాయి. మహాభారతంలో ఒక ముఖ్యమైన కథ శ్రీకృష్ణుడు- శిశుపాలుడుది. శ్రీకృష్ణుడికి మేనత్త కుమారుడు కానీ అతనికి శ్రీకృష్ణుడు అంటే విపరీతమైన ద్వేషం. శిశుపాలుడు శ్రీకృష్ణుడు నిరంతనం అవమానించేవాడు. శ్రీకృష్ణుడు అతన్ని 100 తప్పుడు వరకు క్షమిస్తానని ఆ తర్వాతే ఆ తప్పులకు దండనగా వధిస్తాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ కథలో దాగి ఉన్న లోతైన రహస్యం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం..
మహాభారతంలో శ్రీకృష్ణుడు-శిశుపాలుడు కథ కేవలం శత్రుత్వం కాదు, గత జన్మల కర్మ బంధం. శిశుపాలుడు చేదిరాజు, కృష్ణుడి బంధువు అయినప్పటికీ ఆయనను తీవ్రంగా అవమానించేవాడు. ఈ కథ భాగవత పురాణం మహాభారతంలో వివరించబడింది. శిశుపాలుడు గత జన్మలో విష్ణువు ద్వారపాలకుడైన జయ విజయంలో ఒకడు. సనత్ కుమారుల శాపం వల్ల మానవ జన్మలో శిశుపాలుడుగా జన్మిస్తాడు.
శిశుపాలుడు పుట్టినప్పుడు నాలుగు చేతులతో జన్మిస్తాడు ఆ వికృత రూపాన్ని చూసి అందరూ భయపడతారు అప్పుడే ఆకాశవాణి ఎవరైతే ఈ బాలుని ఎత్తుకున్నప్పుడు మామిడి రూపానికి వస్తాడో అతని చేతిలోనే ఇతను వధించబడతాడు అని అదే ఇతని వరం శాపం అని పలుకుతుంది. ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు తన మేనత్త ఇంటికి వస్తారు ఉయ్యాల్లో ఉన్న శిశుపాలుని శ్రీకృష్ణుడి ఎత్తుకుంటాడు వెంటనే అతను నాలుగు చేతులు పోయి సాధారణ రూపానికి వస్తాడు వెంటనే ఆయన మేనత్తకు అర్థమవుతుంది వెంటనే శ్రీకృష్ణుని పాదాలపై పడి నా కుమారుడు నీ చేతిలోనే మరణిస్తాడు నాకు ఒక వరం ఇవ్వు అని అడుగుతుంది.

నా కుమారుడు పెద్దవాడై మంచివాడైనా లేదా చెడ్డవాడైనా నిన్ను దూషించిన నీమీద శత్రుత్వాన్ని పెంచుకున్న 100 తప్పుల వరకు అతని క్షమించు అని వేడుకుంటుంది. శ్రీకృష్ణుడు అలాగే అని ఆమెకు వరం ఇస్తాడు. 100 తప్ప తర్వాత మాత్రం కచ్చితంగా వధిస్తాను అని శ్రీకృష్ణుడు తెలుపుతాడు. అలా అత్తకి ఇచ్చిన మాట కోసం శ్రీకృష్ణుడు శిశుపాలుడు వంద తప్పులు వరకు క్షమించు కుంటూ వస్తాడు. అయినా వినకుండా రాజసూయగంలో శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం అందుతుందని, అది భరించలేక శ్రీకృష్ణుని దూషిస్తూనే ఉంటాడు వెంటనే శ్రీకృష్ణుడు శిశుపాలుడికి 101 తప్పులు చేశావు అని చెప్పి తన సుదర్శన చక్రంతో వధిస్తాడు. ఇలా శిశుపాలుడు మరణిస్తాడు. ఈ సంఘటన కేవలం శిక్ష కాదు శిశుపాలుడి ఆత్మకు మోక్షం ప్రసాదించే దైవిక చర్య. భాగవతంలో శిశుపాలుడు మరణించినప్పుడు ఆయన ఆత్మ కాంతివంతంగా శ్రీకృష్ణునిలో లీనమైనట్లు చెప్పబడుతుంది.
ఈ కథ కర్మ క్షేమ మోక్ష యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. శిశుపాలుడు శత్రుత్వం కృష్ణుడిపై ద్వేషం నుంచి వచ్చినప్పటికీ అది ఆయన నిరంతరం స్మరించేలా చేసింది. ఎప్పుడు శ్రీకృష్ణుని అవమానించడం కోసం ఆయన పేరుని తలుస్తూనే ఉండేవాడు. ఈస్మరణ ఆయనకు మోక్షం ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి. ద్వేషమైన భక్తితో కూడిన స్మరణ అయిన దైవాన్ని చేరుస్తుంది అని పురాణాలు తెలుపుతున్నాయి. కృష్ణుడి క్షమాగుణం దైవిక న్యాయం ఈ కథలో ప్రతిఫలిస్తాయి ఈ కథ మనకు ఓపిక, కర్మ ఫలితాలు, దైవస్మరణ యొక్క శక్తిని మనకు అర్థమయ్యేలా చెబుతున్నాయి.