డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున సీఎం సహాయ నిధికి రూ. 10 లక్షల విరాళాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అందజేశారు. సందీప్ రెడ్డితో పాటు అతని సోదరుడు ప్రణయ్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.

2013లో ప్రణయ్ రెడ్డి భద్రకాళి ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. ఇందులో అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు నిర్మాణం వహించారు. త్వరలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాను కూడా భద్రకాళి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అభిమానుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి.