కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హోంమంత్రి అనిత ఫోన్‌

-

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి హోంమంత్రి అనిత ఫోన్‌ చేసారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు అనిత. మరోవైపు కోటంరెడ్డిని హతమార్చేందుకు ఏడుగురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ చేసారు. వైఎస్ వివేకా హత్య తరహాలో కోటంరెడ్డిని మర్డర్ చేయాలని కుట్ర చేసారు.

Home Minister Anitha calls Kotamreddy Sridhar Reddy
Home Minister Anitha calls Kotamreddy Sridhar Reddy

ఈ తృణంలోనే పోలీసుల అదుపులో మహేష్, వినీత్, మల్లి, జగదీష్ ఉన్నారు. కోటంరెడ్డి హత్య ప్లాన్ వీడియోకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో పోలీసు లు ఉన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ వైరల్ అయిన వీడియోలో కనిపించేవారు టీడీపీ కార్యకర్తలే అని వైసీపీ అంటోంది. కోటంరెడ్డి బ్రదర్స్ అనుచరులు జ‌గ‌దీష్‌, మ‌హేష్‌ అని చెబుతున్నారు. టీడీపీ క్రియాశీల‌క నేత రూప్‌కుమార్ యాద‌వ్ అనుచరుడు వినీత్ అని వారితో దిగిన ఫోటోలు వైరల్ చేసి వైసీపీ కౌంటర్ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news