హైదరాబాద్ మార్ దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపేసింది భార్య. హైదరాబాద్ – సరూర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. కోదండరాం నగర్ రోడ్డు నెం.7లో నివాసం ఉంటున్నారు జెల్లెల శేఖర్(40), చిట్టి(33). కొంతకాలంగా హరీష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది చిట్టి.

రాత్రి భర్త పడుకోగానే, ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి హత్య చేసారు. ఉదయం ఏమి తెలియనట్లు నిద్రలోనే భర్త శేఖర్ చనిపోయాడని 100కు ఫోన్ చేసింది చిట్టి. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది చిట్టి. దింతో చిట్టిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ప్రియుడు హరీష్ కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ లో దారుణం.!!
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి…
హైదరాబాద్ సరూర్ నగర లో నివసిస్తున్న శేఖర్,భార్య చిట్టి… చిట్టికి వేరే వ్యక్తితో అఫైర్ ఉంది.. ఈ విషయం శేఖర్ కు తెలిసి ఇంట్లో గొడవలు కూడా జరిగాయి.
నిన్న రాత్రి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి, నిద్రలో చనిపోయాడు అని… pic.twitter.com/Pdkp0aV9ps
— Telugu Reporter (@TeluguReporter_) August 29, 2025