ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల మన శరీరంలో విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి జీర్ణక్రియను మెరుగు పడుతుంది. కానీ ఈ నీటిలో కొంచెం నిమ్మరసం లేదా తేనె కలుపుకోవడం వల్ల దాని ప్రయోజనాలు మరింత పెరుగుతాయి అయితే ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది తేనె కలిపిన నీరు మంచిదా? లేక నిమ్మరసం కలిపిన నీరు మంచిదా? ఈ రెండు పానీయాలు మన శరీరానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి అనేది చూద్దాం..
నిమ్మ నీరు ప్రయోజనాలు: విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయలు రోగనిరోధ శక్తినిపెంచి, జలుబు దగ్గు వంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. నిమ్మకాయలోని ఆమ్లాలు, జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. నిమ్మ నీరు జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే నిమ్మనీరు శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. అంతేకాక నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాని శుభ్రపరచీ చర్మ సమస్యలను తగ్గిస్తాయి.
తేనె నీరు ప్రయోజనాలు : తేనెలోని సహజమైన చక్కెరలు కలిగి ఉంటాయి ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయం నీరు తాగడం వల్ల రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో వ్యాధికారక క్రిములను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాక గొంతు నొప్పి, దగ్గు ఉన్నప్పుడు తేనె నీరు తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. తేనె జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

నిమ్మనీరు బరువు తగ్గడానికి, రోజు శక్తిని పెంచుకోవడానికి మంచిది తేనే నీరు. శక్తిని పొందడానికి ఇన్ఫెక్షన్ నివారించడానికి మంచిది నిజానికి ఈ రెండిటిని కలిపి తాగడం కూడా చాలా మంచిది. నిమ్మ, తేనె రెండింటి ప్రయోజనాలు పొందాలంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగవచ్చు.
తేనె నీరు, నిమ్మ నీరు రెండు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నిమ్మనీరు బరువు తగ్గడానికి రోగనిరోధక శక్తి ఉపయోగపడితే తేనె నీరు శక్తిని ఇచ్చి వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. మీ ఆరోగ్య లక్ష్యాలను లక్ష్యాలు ఆధారంగా ఏదైనా ఒక పానీయాన్ని ఎంచుకోవచ్చు లేదా రెండిటిని కలిపి తాగడం వల్ల కూడా రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు.