కాళేశ్వరం ఇష్యూలో… కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ దక్కింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 7వ తేదీన ప్రధాన పిటిషన్ విచారణ ఉన్నందున అప్పటి వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కేసీఆర్, హరీష్ రావు.

కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత, అక్టోబర్ 7వ తేదీన దసరా సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొన్నారు హైకోర్టు న్యాయమూర్తి. అప్పటి వరకు కమిషన్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా పడింది. దింతో కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ దక్కింది.