జమ్ముకశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ కు సెలవు ప్రకటించింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సెలవు ప్రకటన చేసింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం.

సాధ్యమైన చోట ఆన్లైన్ తరగతులు నిర్వహించవచ్చన్న ప్రభుత్వం… ఈ మేరకు ప్రకటన చేసింది జమ్ముకశ్మీర్ ప్రభుత్వం. ఇది ఇలా ఉండగా ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాంకడ్ అలాగే హిమాచల్ ప్రదేశాలలో కొండ చరియలు విరిగిపడి.. జనాలు మరణిస్తున్నారు. ఈ ప్రమాదాల నేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు మరణించారు. ఈ మూడు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ నెల మూడో తేదీ వరకు కేదార్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.