తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరిన ప్రభుత్వం.. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.

సీబీఐ అంగీకరిస్తే బిల్లులు, డబ్బు లావాదేవీలపై లోతైన దర్యాప్తు చేయాలనీ పేర్కొంది. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సీబీఐ దర్యాప్తు జరపాలని లేఖలో వెల్లడించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.