గణపతిని దర్శించుకున్న రోహిత్ శర్మ..సాష్టాంగ న‌మ‌స్కారాలు పెట్టి

-

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలోని వర్లిలో వినాయకుడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిన్న గణపతిని దర్శించుకునేందుకు రోహిత్ శర్మ అక్కడికి చేరుకోగా అతనిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు రోహిత్ శర్మ చుట్టుముట్టారు. గణేశుడిని చూసిన అనంతరం రోహిత్ శర్మ దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. గణేశుడితో రోహిత్ శర్మ ఫోటోలు కూడా దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రోహిత్ శర్మ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సన్నగా, ఫిట్ గా మారాడు.

rohit sharma
rohit sharma

అంతేకాకుండా అతడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే మ్యాచ్లు అడుతున్నాడు. టెస్టులు, t20 లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి త్వరలోనే లండనకు వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తన భార్య, పిల్లలతో కలిసి లండన్ లో ఉండాలని రోహిత్ శర్మ అనుకుంటున్నారట. లండన్ లో ఉండాలని అనుకున్నప్పటికీ మ్యాచ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చి మ్యాచ్లు ఆడి తిరిగి మళ్ళీ లండన్ కు వెళతారు. ఈ విషయం పైన త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news