వేములవాడకు వెళ్లే భక్తులకు అలర్ట్. దసరా తర్వాత అక్టోబర్ 3 నుంచి వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనాలకు అనుమతి ఉండదని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొద్ది రోజుల నుంచి రాజన్న ఆలయ ముందు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా అధికారులు స్వామివారి దర్శనానికి అనుమతి ఉండదని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

కాగా, శివయ్యను దర్శించుకోవాలనే భక్తులకు భీమన్న ఆలయంలో దర్శన అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ విషయంపైన సంబంధిత శాఖ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా, గత కొద్ది రోజుల నుంచి రాజన్న ఆలయం ముందు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు దాదాపు పూర్తి కావోచ్చాయి. దీంతో ఆలయ అభివృద్ధి పనులను వేగంగా జరిపించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.