GHAATI Review: అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ఘాటీ. ఈ సినిమా కథ ఎలా ఉందో తెలుసుకుందాం… అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీని తన సినిమాలతో ఊపు ఊపేసిందని చెప్పాడు. పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాలలోను హీరోయిన్ గా నటించి విపరీతంగా అభిమానులను సొంతం చేసుకుంది.

ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీకి కాస్త హవా తగ్గిపోయింది. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో అనుష్క సినిమాలు మానేసింది. అనుష్క నటించిన తాజా చిత్రం ఘాటీ. చాలా రోజుల తర్వాత అనుష్క శెట్టి తన సినిమాతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది.
ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. ఘాటీ సినిమాలో అనుష్క తనకు జరిగిన అన్యాయానికి ప్రతి కారం తీర్చుకునే ఓ అమ్మాయి లెజెండ్ గా ఎలా మారిందనేది సినిమా కథ. ఈ సినిమాలో చైతన్య రావు విలన్ గా అద్భుతంగా నటించాడు. విక్రమ్ ప్రభు పరిధి మేరకు ఈ సినిమాలో నటించారు.