కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్.. ఇన్ని వేధింపులా అంటూ

-

కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్.. చేశారు. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా? ఇందిరమ్మ రాజ్యమంటే వేధింపులు, బెదిరింపులా అంటూ ఆగ్ర‌హించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న దుర్మార్గమిదని నిప్పులు చెరిగారు.

kavitha, mlc kavitha, brs, kcr
k kavitha tweet on urea issue

యూరియా కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రైతు లక్ష్మణ్ యాదవ్ నిలదీశాడని పోలీసులు ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశారని ఆగ్ర‌హించారు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్టవ్యతిరేక చర్యలకు దిగుతున్నారన్నారు. ఇలాంటి దారుణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని…పాలకుల మెప్పుకోసం ప్రజలను ఇబ్బంది పెడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news