త్వరలోనే పులివెందులకు బై ఎలక్షన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. జగన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు.. చేశారు. పులివెందులకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తే ఎమ్మెల్యే పదవికి అర్హత లేనట్లే భావించాలని తెలిపారు రఘురామకృష్ణంరాజు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నా అని తెలిపారు రఘురామకృష్ణంరాజు. ఇక రఘురామకృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదని కౌంటర్ ఇస్తున్నారు.