తాడిపత్రి నియోజక వర్గంలో హై టెన్షన్ నెలకొంది. తాడిపత్రి బయలుదేరారు మాజీ వైసీపీ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ సందర్భంగా తన నియోజక వర్గం తిమ్మంపల్లిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దారెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రికి పెద్దారెడ్డి బయలు దేరారు. అయితే… మాజీ వైసీపీ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే…మాజీ వైసీపీ పార్టీ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్న నేపథ్యంలో కార్యకర్తల సమావేశాన్ని రద్దు చేసుకున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.
బ్రేకింగ్ న్యూస్
తాడిపత్రి బయలుదేరిన @ysrcparty మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రికి పెద్దారెడ్డి.. భారీగా పోలీసు బలగాల మోహరింపు
తిమ్మంపల్లిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దారెడ్డి ప్రత్యేక పూజలు
కార్యకర్తల సమావేశాన్ని… pic.twitter.com/A7LknscCe8
— Telugu Feed (@Telugufeedsite) September 6, 2025