వర్షాకాలం రాగానే చాలామందికి వచ్చే సాధారణ సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. జలుబు, దగ్గు, గొంతు మంట, గొంతు గరగరా వంటివి ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఆయుర్వేదం అందించే సహాసిద్ధమైన చిట్కాలు సురక్షితమైనవి. సమర్థవంతమైన ఆయుర్వేద చిట్కాలను ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మన ఇంట్లోనే దొరికే వాటితో ఈ సమస్యను తక్షణ ఉపశమనం పొందవచ్చు. మరి ఆయుర్వేదం సూచించిన అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం..
గొంతు నొప్పికి ఆయుర్వేదం అందించే అత్యంత ప్రభావంతమైన చిట్కా ఏంటంటే ఉప్పునీటితో పుక్కిలించడం ఇది ఎన్నో ఏళ్ల నుంచి మన ఇళ్లల్లో వాడుకలో ఉన్న ఒక సాంప్రదాయ చిట్కా చాలా తక్కువ ఖర్చుతో సులభంగా చేయగలిగే ఈ పద్ధతి గొంతు నొప్పిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
ఉప్పు నీటితో పుక్కిలించడం : ఒక గ్లాస్ గోరువెచ్చ నీటిని తీసుకొని ఆ నీటిలో ఒక టీ స్పూన్ ఉప్పు, స్పూన్ పసుపు కలపాలి ఉప్పు పూర్తిగా కరిగిన తరువాత ఆ నీటిని నోట్లో పోసుకొని గొంతులోకి వెళ్లేలా పుక్కిలించి ఉమ్మివేయాలి. ఈ విధంగా 30 సెకండ్ల పాటు ప్రతిరోజూ చేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయడం ద్వారా గొంతు నొప్పి, గొంతులో మంట నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఉప్పులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు గొంతులో ఉండే బ్యాక్టీరియాను, వైరస్లను నాశనం చేస్తాయి.

తులసి ఆకులు తేనె కషాయం: తులసి ఆకులకు సహజంగా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి గొంతు ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే యాంటీ మైక్రోబల్ లక్షణాలు గొంతును శాంత పరచడంలో, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు తులసి ఆకులు వేసి బాగా మరిగించి అవి సగం అయిన తర్వాత ఆ కషాయాన్ని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక చెంచా తేనె కలిపి ఈ కషాయాన్ని సేవించాలి. ఇలా రోజుకి రెండుసార్లు తాగడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
వర్షాకాలంలో గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందడానికి తులసి తేనే కషాయం తాగడం, పసుపు ఉప్పు నీటితో గార్గ్లింగ్ చేయడం చాలా ప్రభావంతమైన ఆయుర్వేద చిట్కాలు. ఈ రెండు సహజ సిద్ధమైనవి కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
గమనిక:ఈ చిట్కాలు కేవలం సాధారణ గొంతు నొప్పికి మాత్రమే. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే, కొన్ని రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.