తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి ఆలయం మళ్లీ తెరుచుకుంది. చంద్రగ్రహణం ముగియడంతో ఉదయం సుప్రభాత సేవలో స్వామివారి ఆలయ ద్వారాలను తెరిచారు తిరుమల శ్రీ వారి పండితులు. చంద్రగ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి, నిత్య పూజలకు అంకురార్పణ చేశారు తిరుమల శ్రీవారి పండితులు.

నిన్న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మూసివేశారు శ్రీవారి ఆలయం. ఇక ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో… తిరిగి తిరుమల శ్రీవారి ఆలయం మళ్లీ తెరుచుకుంది. ఇక చంద్రగ్రహణం నపథ్యంలో.. పళ్లెంలో రోకళ్లను నిలబెట్టారు ప్రజలు. గ్రహణం వీడేంతవరకు ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడుతుందని ప్రజల నమ్మకం అని చెబుతున్నారు.
నిలబడిన రోకలి బండకు చిన్నారుల చేత గుంజీలు తీయించే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తే చేసిన తప్పులను చంద్ర భగవానుడు క్షమిస్తాడని ప్రజల నమ్మకం. పార్వతీపురం మన్యం జిల్లా, ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ ఆచారాలు కనిపించాయి. అయితే.. ఇవన్నీ ఒట్టి మూఢ నమ్మకాలని కొట్టి పారేస్తోంది జన విజ్ఞాన వేదిక.