అల్లు అరవింద్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. అల్లు అరవింద్ కు సంబంధించిన గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి.నాగరాజు కన్నుమూశారు. అల్లు అరవింద్‌కు నాగరాజు అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. ఇక గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి.నాగరాజు మృతి చెందడంతో..అల్లు అరవింద్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

తన తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌ను మరో విషాదం వెంటాడింది. ఈ విషయం తెలియగానే….ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి.నాగరాజు ఇంటికి చేరుకుంది అల్లు అరవింద్ ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా…. గత వారం రోజుల కిందటే… అల్లు అరవింద్ తల్లి మృతి చెందారు. వృద్ధాప్య రావడం… రకరకాల ఆనారోగ్య సమస్యలు రావడంతో…. అల్లు అరవింద్ తల్లి మృతి చెందారు. ఇక ఇప్పుడు నాగరాజు, అరవింద్ చిన్ననాటి స్నేహితుడు కావడం వల్ల ఈ లోటు మరింత బాధాకరంగా మారింది.