ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈనెల 15వ తేదీన మెగా డీఎస్సీ తుది జాబితా రిలీజ్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15వ తేదీన విడుదల కానుందని చెబుతున్నారు. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నారు అధికారులు.

అదే సమయంలో ఈనెల 19వ తేదీన అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సభ లోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
కొత్త టీచర్లకు దసరా సెలవుల్లో ట్రైనింగ్ అలాగే కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగులు కూడా ఇస్తారని చెబుతున్నారు. దసరా సెలవులు పూర్తయిన తర్వాత స్కూలు పునః ప్రారంభమవుతాయి. స్కూల్ సెలవులు పూర్తయిన వెంటనే ఈ కొత్త టీచర్లు బాధ్యతలు నిర్వర్తించబోతున్నారని తెలుస్తోంది.